కత్రినతో డేటింగ్ గురించి ఏం చెప్పాడు?

ABN , First Publish Date - 2020-02-18T19:35:51+05:30 IST

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కత్రినా కైఫ్‌తో డేటింగ్ గురించి అడిగిన ప్రశ్నకు హీరో విక్కీ కౌశల్ అస్పష్టమైన సమాధానం ఇచ్చాడు.

కత్రినతో డేటింగ్ గురించి ఏం చెప్పాడు?

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కత్రినా కైఫ్‌తో డేటింగ్ గురించి అడిగిన ప్రశ్నకు హీరో విక్కీ కౌశల్ అస్పష్టమైన సమాధానం ఇచ్చాడు. కత్రినతో డేటింగ్‌లో ఉన్నాడో, లేడో చెప్పకుండా తనదైన శైలిలో వినూత్నంగా జవాబిచ్చాడు. `ఉరి` సినిమాతో పాపులర్ అయిన హీరో విక్కీ కౌశల్‌తో కత్రిన కొంతకాలంగా డేటింగ్‌లో ఉందని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ ఆంగ్ల ప్రతిక ఈ విషయం గురించి విక్కీని ప్రశ్నించింది. 


ఆ ప్రశ్నకు స్పందించిన విక్కీ.. `నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను బయటపెట్టడానికి నేను ఇష్టపడను. ఎందుకంటే నా విషయాలను పూర్తిగా బయటపెడితే కొందరు తప్పుగా మాట్లాడతారు. కొందరు వాటి గురించి చర్చలు మొదలుపెడతారు. నాకు అది ఇష్టం ఉండదు. అందుకే నేను నా వ్యక్తిగత విషయాన్ని బయటపెట్టను. నా నిర్ణయాన్ని మీరు గౌరవించాల`ని విక్కీ చెప్పాడు. దీంతో క్రతినతో డేటింగ్‌ను విక్కీ కన్ఫామ్ చేసినట్టా? కాదా? అని నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. 

Updated Date - 2020-02-18T19:35:51+05:30 IST