‘వేయి శుభములు కలుగు నీకు’ ఫస్ట్ లుక్ వదిలిన నాని
ABN , First Publish Date - 2020-08-27T20:58:24+05:30 IST
జయదుర్గా దేవి మల్టీమీడియా పతాకంపై నటుడు శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజా మరియు తమన్నా వ్యాస్ హీరోహీరోయిన్లుగా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము

జయదుర్గా దేవి మల్టీమీడియా పతాకంపై నటుడు శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజా మరియు తమన్నా వ్యాస్ హీరోహీరోయిన్లుగా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’. తాజాగా న్యాచురల్ స్టార్ నాని ఈ చిత్రం యొక్క టైటిల్ పోస్టర్‌ని మరియు మోషన్ పోస్టర్‌ని విడుదల చేసి యూనిట్ సభ్యులందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శివాజీ రాజా మాట్లాడుతూ.. ‘‘జయదుర్గా దేవి మల్టీమీడియా పతాకంపై రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము నరసింహ పటేల్ నిర్మాతగా మా అబ్బాయి విజయ్ రాజా హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘వేయి శుభములు కలుగు నీకు’ అని నామకరణం చేశారు. హీరో నాగ శౌర్య క్లాప్‌తో మొదలైన ఈ సినిమా ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంది. ఈ రోజు(గురువారం) ఈ చిత్రం యొక్క టైటిల్ లోగోను మరియు మోషన్ పోస్టర్‌ను హీరో నాని విడుదల చేశారు, వారికి నా ధన్యవాదాలు. మా అబ్బాయి విజయ్ రాజాకి మంచి నిర్మాత మరియు మంచి దర్శకుడు దొరికారు, ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. సెప్టెంబర్‌లో వైజాగ్ మరియు అరకు ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది. నన్ను ఆశీర్వదించి నట్లే.. నా కుమారుడిని కూడా ఆశీర్వదించండి’’ అని కోరారు.
నిర్మాత తూము నరసింహ పటేల్ మాట్లాడుతూ.. ‘‘జయదుర్గా దేవి మల్టీమీడియా బ్యానర్‌పై ఇది మా మొదటి సినిమా. 30 రోజులు ఏకధాటిగా షూటింగ్ చేస్తున్నాం. సినిమా బాగా వస్తుంది. ఈరోజు సినిమా టైటిల్ ‘వేయి శుభములు కలుగు నీకు’ పోస్టర్‌ను మరియు మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన హీరో నానిగారికి ధన్యవాదాలు’’ అని తెలిపారు.
హీరో విజయ్ రాజా మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకి నన్ను హీరోగా పెట్టుకున్న మా దర్శకుడు రామ్స్ రాథోడ్‌గారికి మరియు మా నిర్మాత తూము నరసింహ పటేల్‌గారికి నా ధన్యవాదాలు. నెల రోజులుగా కరోనాను జయంచి మేము షూటింగ్ చేస్తున్నాం. ఈరోజు స్పెషల్ డే నాకు, హీరో నానిగారు మా చిత్రం టైటిల్ పోస్టర్‌ను మరియు మోషన్ పోస్టర్‌ను విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది’’ అని తెలిపారు.
దర్శకుడు రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ.. ‘‘శివాజీరాజాగారి అబ్బాయి విజయ్ రాజాగారికి ఈ కరోనా టైమ్‌లో మాకు డేట్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒక్క రోజు గ్యాప్ లేకుండా క్రమశిక్షణతో ఏకధాటిగా షూటింగ్ చేశాము. మా సినిమాకి హీరో నాగ శౌర్య క్లాప్ ఇస్తే, ఈ రోజు హీరో నాని గారు మా చిత్ర ‘వేయి శుభములు కలుగు నీకు’ టైటిల్ లోగోను మరియు మోషన్ పోస్టర్‌ను విడుదల చేసారు, వారికి నా ధన్యవాదాలు. మా నిర్మాత తూము నరసింహ పటేల్‌గారికి సినిమాలు అంటే ప్యాషన్. మంచి నిర్మాత దొరికాడు మాకు. ఎక్కడ ఇబ్బంది పడకుండా సినిమాని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మా సినిమా టైటిల్ లాగానే ప్రేక్షకులందరూ మా టీమ్‌ని మా సినిమాని లక్షల శుభాలతో ఆశీర్వదించాలి’’ అని కోరుకున్నారు.