ఇక చాలు.. సుశాంత్‌ను వదిలిపెట్టండి: నసీరుద్దీన్ షా

ABN , First Publish Date - 2020-08-02T04:46:24+05:30 IST

సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా.. ఎవరైనా హత్య చేశాడా.. ప్రియురాలు రియా పాత్ర ఎంత..? అంటూ ప్రతి క్షణం జాతీయ న్యూస్ చానెళ్లు సుశాంత్ మృతిపై...

ఇక చాలు.. సుశాంత్‌ను వదిలిపెట్టండి: నసీరుద్దీన్ షా

ముంబై: సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా.. ఎవరైనా హత్య చేశాడా.. ప్రియురాలు రియా పాత్ర ఎంత..? అంటూ ప్రతి క్షణం జాతీయ న్యూస్ చానెళ్లు సుశాంత్ మృతిపై విపరీతంగా డిబేట్లు పెడుతున్నాయి. సుశాంత్ సన్నిహితులు, సహచర నటులు, ఇలా ప్రతి ఒక్కరితో రోజుకో లైవ్ ఇస్తున్నాయి. అయితే ఈ డిబేట్లపై బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరణించిన తరువాత కూడా సుశాంత్‌ను ప్రశాంతంగా ఉండనివ్వరా.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మనలో ఉన్న చెడును బహిరంగంగా ప్రదర్శించాల్సిన అవసరం ఏంముంది..? ఇప్పటికిప్పుడు కొందరు నటులు తెరపైకి వచ్చి తమకు కూడా సుశాంత్ లానే అన్యాయం జరిగిందని వాపోతున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ అవకాశాలు రాని వారు ఎంతో మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా రోడ్డెక్కితే సినీ ఇండస్ట్రీని మించిన నరకం భూమిపైనే లేదనిపిస్తుంది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. సుశాంత్ మృతి డిబేట్లు పెట్టే న్యూస్ చానెళ్లు మరింత దిగజారకండి’ అంటూ నసీరుద్దీన్ షా పేర్కొన్నారు.

Updated Date - 2020-08-02T04:46:24+05:30 IST