కరోనాను జయించిన అమితాబ్.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

ABN , First Publish Date - 2020-08-02T22:57:15+05:30 IST

కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముంబైలోని...

కరోనాను జయించిన అమితాబ్.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

ముంబై: కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముంబైలోని నానావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని అభిషేక్ బచ్చన్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. తన తండ్రికి తాజాగా చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌ తేలిందని, దీంతో.. ఆసుపత్రి నుంచి ఆయనను డిశ్చార్జ్ చేసినట్లు అభిషేక్ ట్వీట్‌లో తెలిపారు. ఇకపై ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోనున్నట్లు చెప్పారు. తన తండ్రి కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.


బచ్చన్‌ కుటుంబంలో కరోనా బారిన పడిన ఐశ్వర్య, ఆరాధ్య ఇటీవల కోలుకుని పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. దురదృష్టవశాత్తూ తనకు మళ్లీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, తాను ఆసుపత్రిలోనే ఉండనున్నట్లు అభిషేక్ ట్వీట్ చేశారు. త్వరలోనే అందరి ప్రార్థనా బలంతో తాను కరోనాను జయించి ఆరోగ్యంగా ఇంటికి వెళతానని మాటిస్తున్నట్లు ట్వీట్ చేశారు.Updated Date - 2020-08-02T22:57:15+05:30 IST