‘వకీల్‌సాబ్’కి త్రివిక్రమ్ చేసింది ఇదే

ABN , First Publish Date - 2020-06-08T03:20:05+05:30 IST

చాలా గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్’. పరిస్థితులన్నీ బాగుండి ఉంటే ఈపాటికే ఈ చిత్రం థియేటర్లలో హడావుడి చేస్తుండేది. కానీ కరోనాతో

‘వకీల్‌సాబ్’కి త్రివిక్రమ్ చేసింది ఇదే

చాలా గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్’. పరిస్థితులన్నీ బాగుండి ఉంటే ఈపాటికే ఈ చిత్రం థియేటర్లలో హడావుడి చేస్తుండేది. కానీ కరోనాతో అన్నీ తారుమారయ్యాయి. ఇప్పుడు థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. షూటింగ్స్‌కు అనుమతి వచ్చినా.. థియేటర్స్ తెరుచుకోవడానికి మాత్రం ఇంకాస్త టైమ్ పట్టేలానే ఉంది. ఒకవేళ థియేటర్స్ తెరుచుకున్నా.. ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అందుకే పెద్ద నిర్మాతలు వారి చిత్రాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇక పవన్ రీ ఎంట్రీ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. 


తాజాగా వేణు శ్రీరామ్ తను పవన్‌తో చేస్తున్న ‘వకీల్‌సాబ్’ గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ సినిమాకు సెల్యూలాయిడ్ దర్శకుడు త్రివిక్రమ్ ఎలా భాగమయ్యారో ఆయన తెలిపారు. అసలైతే ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు రాస్తున్నారని మొదటి నుంచి వినిపిస్తుంది. ఆ మాట నిజమే కానీ.. ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బిజీగా ఉండటం వల్ల త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు రాయలేదని వేణు శ్రీరామ్ తెలిపారు. ఈ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం నాకు రావడానికి కారణం మాత్రం త్రివిక్రమే అని వేణు శ్రీరామ్ తెలిపారు. దిల్ రాజు, త్రివిక్రమ్ కలిసి ‘పింక్’ రీమేక్ గురించి చర్చించుకుంటున్నారని, ఆ సమయంలో దిల్ రాజుకు వేరే కథ వినిపించడానికి వెళ్లానని వేణు అన్నారు. ఆ తర్వాత ‘పింక్’ రీమేక్ నీవే చేస్తున్నావంటూ.. నన్ను సెలక్ట్ చేశారని, అలా త్రివిక్రమ్ ఈ సినిమా విషయంలో తన రోల్ పోషించారని వేణు శ్రీరామ్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-06-08T03:20:05+05:30 IST