మహేష్‌ విష్‌తో వెన్నెల కిషోర్‌ ఫుల్‌ ఖుషీ

ABN , First Publish Date - 2020-09-20T02:24:22+05:30 IST

కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న కమెడియన్ వెన్నెల కిషోర్‌. ఇప్పుడొస్తున్న ప్రతి చిత్రంలో వెన్నెల కిషోర్‌

మహేష్‌ విష్‌తో వెన్నెల కిషోర్‌ ఫుల్‌ ఖుషీ

కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న కమెడియన్ వెన్నెల కిషోర్‌.  ఇప్పుడొస్తున్న ప్రతి చిత్రంలో వెన్నెల కిషోర్‌ పాత్ర ఉంటుందంటే.. ఆయన క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. చిన్న హీరో అయినా, పెద్ద హీరో అయినా.. ఏ హీరో అయినా.. కామెడీ పండించేందుకు వెన్నెల కిషోరే ఆప్షన్ అన్నట్లుగా వెన్నెల మారిపోయాడు. ఇప్పుడున్న బిజీ ఆర్టిస్ట్‌లలో ఒకరిగా వెన్నెల కిషోర్‌ టాప్‌ స్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. సూపర్‌ స్టార్‌ విష్‌తో వెన్నెల యమా ఖుషీ అయిపోయారు. తన ఆనందాన్ని తెలియజేస్తూ.. మహేష్‌కు వెన్నెల ధన్యవాదాలు తెలిపారు.


"వెన్నెల కిషోర్‌ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరు ఎప్పుడూ ఎలా అయితే సంతోషంగా ఉంటారో.. అలాగే సంతోషంగా ఉండండి.." అని మహేష్‌ చేసిన ట్వీట్‌కు.. '' ఈ ట్వీట్‌ ఒక్కటి చాలు సార్‌.. నేను మరింత కాలం సంతోషంగా ఉంటాను. మీ దయాగుణం చాలా గొప్పది. మీకు టన్నుల కొద్ది ధన్యవాదాలు.." అని వెన్నెల కిషోర్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.Updated Date - 2020-09-20T02:24:22+05:30 IST