నాగశౌర్య విమర్శలపై వెంకీ కుడుముల రియాక్షన్!

ABN , First Publish Date - 2020-02-21T17:13:31+05:30 IST

తను హీరోగా `ఛలో` సినిమా రూపొందించిన దర్శకుడు వెంకీ కుడుములపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హీరో నాగశౌర్య విమర్శలు చేశాడు.

నాగశౌర్య విమర్శలపై వెంకీ కుడుముల రియాక్షన్!

తను హీరోగా `ఛలో` సినిమా రూపొందించిన దర్శకుడు వెంకీ కుడుములపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హీరో నాగశౌర్య విమర్శలు చేశాడు. వెంకీ కుడుముల ఓ నమ్మకద్రోహి అని, అతను తన స్నేహితుడే కాదని నాగశౌర్య అన్నాడు. అలాగే తన అమ్మ బహుమతిగా ఇచ్చిన కారును వాడకుండా పక్కన పడేశాడని చెప్పాడు. నాగశౌర్య చేసిన విమర్శలపై తాజాగా వెంకీ కుడుముల రియాక్ట్ అయ్యాడు. 


`నా పద్ధతి ఎవరికైనా నచ్చకపోతే నేనేం చేయలేను. నేను సినిమా గురించి తప్ప మిగిలిన విషయాల గురించి ఆలోచించను. `ఛలో` సినిమా విజయం సాధించడంతో నాగశౌర్య నాకు కారు బహుమతిగా ఇచ్చారు. ఆ కారు నేను అమ్మలేదు. నా దగ్గరే ఉంది.  మనస్పర్థలు ఎవరికైనా ఉంటాయి. అయినా మా ఇద్దరి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల గురించి ప్రజలకు అంత ఆసక్తి ఉండదు. ఆ ఆరోపణల గురించి నేనేం కామెంట్ చెయ్యన`ని వెంకీ కుడుముల చెప్పాడు. 

Updated Date - 2020-02-21T17:13:31+05:30 IST