వెంకీ ఎంటరయ్యారు!

ABN , First Publish Date - 2020-12-24T06:19:17+05:30 IST

వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌ కాంబినేషన్‌లో ‘ఎఫ్‌ 2’ చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకొంటున్న ‘ఎఫ్‌3’ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ బుధవారం మొదలైంది...

వెంకీ ఎంటరయ్యారు!

వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌ కాంబినేషన్‌లో ‘ఎఫ్‌ 2’ చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకొంటున్న ‘ఎఫ్‌3’ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌  బుధవారం మొదలైంది. విక్టరీ వెంకటేశ్‌ సెట్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వర్కింగ్‌ స్టిల్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి, ‘షూటింగ్‌ బిగిన్స్‌’ అని పేర్కొంది చిత్ర బృందం. ‘నారప్ప’ షూటింగ్‌ కోసం గెడ్డం పెంచిన వెంకటేశ్‌ నీట్‌గా షేవ్‌ చేసుకొని ఈ షూటింగ్‌కు హాజరయ్యారు. ఎఫ్‌2కు మరింత వినోదాన్ని జోడించి ఈ సినిమా రూపొందిస్తున్నట్లు దర్శకుడు అనిల్‌ రావిపూడి చెప్పారు. దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిసున్నారు. 

Updated Date - 2020-12-24T06:19:17+05:30 IST