బాలయ్యకు వెంకీ, మంచు లక్ష్మి విషెస్!

ABN , First Publish Date - 2020-06-10T21:36:17+05:30 IST

షష్టిపూర్తి సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నటసింహం నందమూరి బాలకృష్ణకు

బాలయ్యకు వెంకీ, మంచు లక్ష్మి విషెస్!

షష్టిపూర్తి సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నటసింహం నందమూరి బాలకృష్ణకు సినీ ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు బాలయ్యకు విషెస్ చెప్పారు. తాజాగా సీనియర్ హీరో వెంకటేష్, మంచు లక్ష్మి కూడా బాలయ్యకు విషెస్ చెప్పారు. 


`ప్రియమైన బాలయ్యబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా మీ వ్యక్తిగత, వృత్తిగత జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. `బీబీ3`లో మీరు అద్భుతంగా ఉన్నార`ని వెంకీ ట్వీట్ చేశారు. మంచు లక్ష్మి కూడా బాలయ్యకు విషెస్ తెలిపారు. `నేను అన్నయ్య పిలిచే వారిలో బాలయ్య ఒకరు. 16 ఏళ్ల వయసు వారు మాత్రమే మీ ఎనర్జీని మ్యాచ్ చేయగలరు. 60వ వసంతంలోకి అడుగుపెడుతున్న మీకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు` అని మంచు లక్ష్మి ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-06-10T21:36:17+05:30 IST