ఇండియాని సేఫ్‌గా ఉంచేందుకు ఈ మూడూ పాటిద్దాం: వెంకటేష్

ABN , First Publish Date - 2020-10-08T22:15:18+05:30 IST

మాస్క్ ధరించడం, చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, భౌతికదూరం పాటించడం ద్వారా కరోనాని అరికట్టవచ్చని ఇప్పటి వరకు ప్రభుత్వాలు, వైద్యులు

ఇండియాని సేఫ్‌గా ఉంచేందుకు ఈ మూడూ పాటిద్దాం: వెంకటేష్

మాస్క్ ధరించడం, చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, భౌతికదూరం పాటించడం ద్వారా కరోనాని అరికట్టవచ్చని ఇప్పటి వరకు ప్రభుత్వాలు, వైద్యులు చెప్పుకుంటూ వస్తున్నారు. రానున్న చలికాలం అలాగే పండగలను దృష్టిలో పెట్టుకుని కరోనా ఉదృతి పెరగకుండా ఉండేందుకు పై మూడింటి ఆవశ్యకతలను తెలియజేస్తూ.. కేంద్ర ప్రభుత్వం 'జన్‌ ఆందోళన్‌' పేరిట ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ తన సోషల్‌ మీడియా అకౌంట్స్ల్‌ ద్వారా గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ.. విక్టరీ వెంకటేష్‌ ఓ వీడియోని తాజాగా పోస్ట్ చేశారు.


''ఇండియాని సేఫ్‌గా ఉంచేందుకు నా దగ్గర ఉన్న మంత్రాలివే.. మాస్క్‌ను ధరించడం,  చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, భౌతికదూరం పాటించడం. కరోనాకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ చేపట్టిన జన్‌ ఆందోళన్‌లో అందరం భాగమవుదాం.." అని తెలుపుతూ.. నాలాగే అందరూ కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో భాగం అవుతారని కోరుకుంటున్నానని వెంకటేష్‌ తెలిపారు.Updated Date - 2020-10-08T22:15:18+05:30 IST