ప్లాస్మా దాతలారా ముందుకు రండి: వెంకటేశ్
ABN , First Publish Date - 2020-07-27T17:15:50+05:30 IST
అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేశ్ ప్లాస్మా దాతలు ముందుకు రావాలన్నారు

కోవిడ్ 19 మహమ్మారి ఎక్కువగా ప్రబలుతుంది. ఈ నేపథ్యంలో కోవిడ్ 19 బారి నుండి కోలుకున్నవారు ప్లాస్మాను దానం చేయడం ద్వారా కరోనా వైరస్ బాధితులను కాపాడవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వారియర్స్ ముందుకు రావాలని టాలీవుడ్ సెలబ్రిటీలు విజ్ఞప్తి చేస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, అమల, మహేశ్, సాయితేజ్ తదితరులు ప్లాస్మా దానం చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు మరో అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేశ్ ప్లాస్మా దాతలు ముందుకు రావాలన్నారు. ప్లాస్మాను దానం చేయాలని సైబరాబాద్ పోలీసుశాఖ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను షేర్ చేసిన వెంకటేశ్.. ‘‘ప్లాస్మా దాతలారా! అడుగు ముందుకేయండి. ప్లాస్మాను దానం చేసి ప్రాణాలను కాపాడండి’’ అని మెసేజ్ పోస్ట్ చేశారు వెంకటేశ్.
Read more