టీమిండియా‌కు వెంకీ విషెస్!

ABN , First Publish Date - 2020-12-29T17:01:02+05:30 IST

బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన టీమిండియాను టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ అభినందించారు.

టీమిండియా‌కు వెంకీ విషెస్!

బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన టీమిండియాను టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ అభినందించారు. టీమ్ అద్భుత ప్రదర్శన కనబరిచిందని ప్రశంసించారు. `అద్భుత విజయం. అభినందనలు. మెల్‌బోర్న్ టెస్ట్‌లో టీమిండియా గెలిచింది. టీమ్ అంతా చక్కని ఆటతీరు ప్రదర్శించింద`ని వెంకీ ట్వీట్ చేశారు. 


తొలి టెస్ట్‌లో ఘోర పరాజయం పాలైన టీమిండియా మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో 8 వికెట్లతో ఘన విజయం సాధించింది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ సమష్టి ప్రదర్శనతో కేవలం నాలుగు రోజుల్లోనే గెలుపొందింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. Updated Date - 2020-12-29T17:01:02+05:30 IST