విక్టరీ వెంకీ సపోర్ట్ తీసుకుంటోన్న మాస్ రాజా
ABN, First Publish Date - 2021-01-01T02:03:43+05:30
మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం 'క్రాక్' షూటింగ్ మొత్తం పాటలతో సహా పూర్తయి
మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం 'క్రాక్' షూటింగ్ మొత్తం పాటలతో సహా పూర్తయి, సంక్రాంతి కానుకగా విడుదలకు రెడీ అవుతోంది. రవితేజ సరసన శ్రుతి హాసన్ నటిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ మూవీకి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఆయన వాయిస్ ఓవర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించింది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి విడుదలైన వాటికి మంచి స్పందన వస్తుండటంతో.. చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను నూతన సంవత్సర కానుకగా జనవరి 1న విడుదల చేసి.. సంక్రాంతికి రిలీజ్ కాబోతోన్న సినిమాపై మరింతగా అంచనాలు పెంచాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాతో రవితేజ, గోపీచంద్ మలినేని ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేశారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ పవర్‌ఫుల్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. ఎస్. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.