ఈ హీరో.. మల్టీస్టారర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్

ABN , First Publish Date - 2020-05-27T00:18:43+05:30 IST

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా.. అంటే అందరూ ఖచ్చితంగా విక్టరీ వెంకటేష్ పేరే చెబుతారు. ఎందుకంటే ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల

ఈ హీరో.. మల్టీస్టారర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా.. అంటే అందరూ ఖచ్చితంగా విక్టరీ వెంకటేష్ పేరే చెబుతారు. ఎందుకంటే ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల టైమ్‌లో రెగ్యులర్‌గా మల్టీస్టారర్ సినిమాలు వచ్చేవి. ఆ తర్వాత మల్టీస్టారర్ సినిమాలు అంటే అందరూ మరిచిపోయారు. చేస్తే హీరోలే డబుల్ రోల్ చేయడం చూశారు కానీ, మల్టీస్టారర్ సినిమాలు దాదాపు అందరూ మరిచిపోతున్న సమయంలో తిరిగి వాటిని పునరుద్ధించిన హీరో మాత్రం విక్టరీ వెంకటేషే. అందుకే ఆయనని మల్టీస్టారర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అని పిలిచేది. 


‘ఈనాడు’ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్‌తో,  ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో, ‘మసాలా’ చిత్రంలో ఎనర్జిటిక్ హీరో రామ్‌తో, ‘గోపాల గోపాల’ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో, ‘ఎఫ్ 2’ చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో, ‘వెంకీ మామ’లో మేనల్లుడు యువసామ్రాట్ నాగచైతన్యతో వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రాలు చేశారు. ప్రస్తుతం ‘నారప్ప’ చిత్రం చేస్తున్న వెంకటేష్ ఆ తర్వాత మరో మల్టీస్టారర్ చిత్రం చేసేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తుంది. నాచురల్ స్టార్ నాని లేదంటే సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్‌‌తో వెంకీ తదుపరి మల్టీస్టారర్ చిత్రం ఉండబోతున్నట్లుగా టాలీవుడ్‌లో వినిపిస్తుంది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం ఉన్న ఏ హీరోకూ లేని మల్టీస్టారర్ రికార్డ్ వెంకీ పేరున ఉంది కాబట్టి.. ఆయనే మల్టీస్టారర్ చిత్రాలకి బ్రాండ్ అంబాసిడర్.

Updated Date - 2020-05-27T00:18:43+05:30 IST