ఆ పాత్రకి ఎన్నో ప్రశంసలు పొందా..: వెంకీ

ABN , First Publish Date - 2020-04-28T02:26:39+05:30 IST

తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయిన సూప‌ర్ హిట్ ఫ్యామిలీ సినిమా ‘ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే’ విడుద‌లై సోమవారం నాటికి (ఏప్రిల్ 27)కి స‌రిగ్గా

ఆ పాత్రకి ఎన్నో ప్రశంసలు పొందా..: వెంకీ

తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయిన సూప‌ర్ హిట్ ఫ్యామిలీ సినిమా ‘ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే’ విడుద‌లై సోమవారం నాటికి (ఏప్రిల్ 27)కి స‌రిగ్గా ప‌ద‌మూడేళ్లు. బాక్సాఫీస్ వ‌ద్ద 30 కోట్ల వ‌సూళ్లు సాధించి విక్ట‌రీ వెంక‌టేష్ కెరీర్‌లో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ సాయి దేవా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఎన్.వి.ప్ర‌సాద్ - శానం నాగ అశోక్ కుమార్ నిర్మించిన చిత్ర‌మిది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం.. బాల‌మురుగ‌న్ ఫోటోగ్ర‌ఫీ అందించారు. ఈ చిత్రం 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విక్టరీ వెంకటేష్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ దర్శకుడు సెల్వరాఘవన్‌కు ధన్యవాదాలు తెలిపారు. 


‘‘ఈ చిత్రంలో నేను పోషించిన వివిధ భావోద్వేగాలు నాకెంతో ఇష్టం. ముఖ్యంగా కోట శ్రీనివాసరావుగారికి, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు. ఈ చిత్రం చాలా బాగా రూపొందింది. వ్యక్తిగతంగా ఈ చిత్రంలో నేను చేసిన పాత్రకు ఎన్నో ప్రశంసలు పొందాను. నన్ను ఈ చిత్రంలో భాగస్వామిని చేసిన దర్శకుడు సెల్వరాఘవన్‌కు ధన్యవాదాలు. త్రిష అద్భుతమైన కో స్టార్ మరియు యువన్ శంకర్ రాజా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు..’’ అని వెంకీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.Updated Date - 2020-04-28T02:26:39+05:30 IST