అందాల ఆరబోతతో మతిపోగొడుతున్న హీరోయిన్
ABN , First Publish Date - 2020-12-01T17:04:54+05:30 IST
సినీ పరిశ్రమలోకి వచ్చి 14 ఏళ్లవుతున్న అంతే గ్లామరస్‌ను మెయిన్‌టెయిన్ చేస్తూ ఇంకా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న హీరోయిన్ వేదిక.

సినీ పరిశ్రమలోకి వచ్చి 14 ఏళ్లవుతున్న అంతే గ్లామరస్‌ను మెయిన్‌టెయిన్ చేస్తూ ఇంకా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న హీరోయిన్ వేదిక. కెరీర్ ఫ్రారంభంలో ఈ అమ్మడు తెలుగులో 'విజయదశమి, బాణం' వంటి తెలుగు చిత్రాలతో పాటు 'ముని' చిత్రంలోనూ మెప్పించిన సంగతి తెలిసిందే. ఎందుకనో తెలియదు కానీ ఈమెకు తెలుగు కంటే ఇతర భాషల్లోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. దానికి తగ్గట్టు ఈ సొగసరికి తమిళం, మలయాళ, కన్నడ సినిమాల్లోనే అవకాశాలు వచ్చాయి. చాలా గ్యాప్ తర్వాత గత ఏడాది బాలకృష్ణ 'రూలర్'లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. సినీ లవర్స్‌ను సినిమాల కంటే సోషల్ మీడియాలో మెప్పిస్తున్న వేదిక ఇప్పుడు మాల్దీవుల్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తుంది. కేవలం వెకేషన్‌ను ఎంజాయ్ చేయడమే కాదండోయ్ తన అందాల ఆరబోతతో మాల్దీవుల్లోని బీచ్‌లకే హీటు పుట్టిస్తుంది. ఫొటోలను చూస్తే మీరు కూడా కాదనలేరు మరి.