‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ఫస్ట్‌ సింగిల్‌ వదిలిన మెగాహీరో

ABN , First Publish Date - 2020-02-21T23:15:23+05:30 IST

శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె. రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం

‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ఫస్ట్‌ సింగిల్‌ వదిలిన మెగాహీరో

శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె. రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా..’. యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కొండా విజయ్‌కుమార్‌ దర్శకుడు. ఈ చిత్రం నుంచి ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున, మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేశారు. ఈ పాటకు కె.కె. సాహిత్యం అందించగా అర్మాన్ మాలిక్, పి. మేఘన ఆలపించారు. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యం వహించారు. 


ఈ ఫస్ట్‌ సింగిల్‌ విడుదలైన సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ.. ‘‘వరుణ్‌తేజ్‌గారు మా సినిమాలోని మొదటి పాటను విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పాట విడుదలైన కొద్దిసేపట్లోనే చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ పాటకు కె.కె. చక్కటి సాహిత్యాన్ని అందించారు. దానికి తగ్గట్టుగానే అనూప్‌ రూబెన్స్‌ మంచి మ్యూజిక్‌ చేశారు. మా సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైనప్పటి నుంచి అన్నీ పాజిటివ్‌ వైబ్రేషన్సే కనిపిస్తున్నాయి. ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు మొదటి పాటకు సెకన్ల వ్యవధిలోనే మంచి వ్యూస్‌ వచ్చాయి. పాట ఎంతో బాగుందంటూ కామెంట్స్‌ కూడా పెడుతున్నారు. మిగతా పాటలు కూడా బాగా కుదిరాయి. తప్పకుండా మ్యూజికల్‌గా పెద్ద హిట్‌ అవుతుంది. ప్రస్తుతం మా సినిమాకి సంబంధించి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఉగాది కానుకగా మార్చి 25న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. మా బేనర్‌లో తప్పకుండా ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది.’’ అన్నారు.


యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - 2020-02-21T23:15:23+05:30 IST