ఓకే సాంగ్.. ముగ్గురు హీరోలు
ABN , First Publish Date - 2020-05-25T17:50:29+05:30 IST
క్రమంగా టాలీవుడ్‌లో బాలీవుడ్ ట్రెండ్ స్టార్ట్ అవుతోంది. మల్టీస్టారర్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు సాంగ్స్‌లోనూ ఇద్దరు, ముగ్గురు స్టార్స్ సందడి చేయడం షురూ చేశారు.

క్రమంగా టాలీవుడ్‌లో బాలీవుడ్ ట్రెండ్ స్టార్ట్ అవుతోంది. మల్టీస్టారర్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు సాంగ్స్‌లోనూ ఇద్దరు, ముగ్గురు స్టార్స్ సందడి చేయడం షురూ చేశారు. అందులో భాగంగా రీసెంట్‌గా విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’ తొలి వీడియో సాంగ్‌లో ‘నో పెళ్లి..’ను సాయితేజ్‌తో పాటు వరుణ్‌తేజ్, రానా కూడా సందడి చేయడం విశేషం.
సాంగ్ విడుదల చేసిన తర్వాత ట్విట్టర్ ద్వారా ‘‘సాయితేజ్ ఇచ్చిన గిఫ్ట్ చాలా బావుంది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ సాంగ్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. అయితే నువ్వెన్ని రోజులు సింగిల్‌గా ఉంటావో చూస్తాను. కొన్నిసార్లు చేసుకోవడంలో టైమ్ గ్యాప్ ఉంటుందేమో కానీ,చేసుకోవడం మాత్రం పక్కా’’ అని నితిన్ తెలిపారు. ‘‘ఈ సాంగ్‌లో భాగం కావడం చాలా ఫన్‌గా అనిపించింది’’ అని వరుణ్ తేజ్ తెలిపారు. ‘‘నా యూత్‌లో టంగ్ స్లిప్ అనొచ్చు సాయితేజ్’’ అని రానా అన్నారు.
మ్యూజికల్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించిన ఈ పాటను రఘురామ్ రాయగా.. అర్మాన్ మాలిక్ పాటను పాడారు. త్వరలోనే ఈ సినిమా విడుదలపై నిర్మాతలు అధికారిక ప్రకటన చేస్తారు. ఈ చిత్రానికి వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.