మెగాఫోన్ పట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్
ABN , First Publish Date - 2020-10-18T17:01:50+05:30 IST
వరలక్ష్మి శరత్‌కుమార్ దర్శకురాలిగా మారారు. ఈమె దర్శకత్వంలో తెన్నాండాల్ ఫిలింస్ బ్యానర్‌పై రామస్వామి నిర్మాతగా 'కన్నామూచి'(దాగుడుమూతలు) అనే సినిమా రూపొందనుంది.

హీరోయిన్‌గానే కాదు, ప్రతినాయిక పాత్రలతో పాటు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకుంది వరలక్ష్మి శరత్‌కుమార్. ఇప్పుడు మరో కొత్త ప్రయాణానికి ఆమె శ్రీకారం చుట్టారు. వరలక్ష్మి శరత్‌కుమార్ దర్శకురాలిగా మారారు. ఈమె దర్శకత్వంలో తెన్నాండాల్ ఫిలింస్ బ్యానర్‌పై రామస్వామి నిర్మాతగా 'కన్నామూచి'(దాగుడుమూతలు) అనే సినిమా రూపొందనుంది. స్త్రీ సాధికారతను తెలియజేసేలా 'ఇక్కడ చాలా ధైర్యవంతురాలైన మహిళ ఉంది. మనకు వారు తెలుసు, మనలోనే వారుండొచ్చు అలాంటి వారి గురించి బలంగా చెబుతాం' అని అంటూ... ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను తాప్సీ, లక్ష్మీమంచు, సమంత, ఐశ్వర్యా రాజేష్, సాయిపల్లవి, రాధికా శరత్‌కుమార్, జ్యోతిక, కీర్తిసురేష్, మంజిమ మోహన్, కాజల్ అగర్వాల్, రెజీనా కసండ్ర, శ్రద్ధా శ్రీనాథ్, అదితిరావు హైదరి, హన్సిక, సుహాసిని, సిమ్రాన్, చిన్మయి,త్రిష, అకరా హాసన్, ఆండ్రియా, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, సయేషా సైగల్, శృతిహాసన్ తదితరులు వారి ట్విట్టర్‌లో షేర్ చేస్తూ వరలక్ష్మి శరత్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు.