వరలక్ష్మీ మళ్లీ హీరోయిన్‌గా..

ABN , First Publish Date - 2020-06-16T03:12:50+05:30 IST

వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్‌గా కొన్ని సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. హీరో విశాల్ సరసన ఆమె నటించిన తర్వాత వారిద్దరికి మ్యారేజ్ అంటూ వార్తలు

వరలక్ష్మీ మళ్లీ హీరోయిన్‌గా..

వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్‌గా కొన్ని సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. హీరో విశాల్ సరసన ఆమె నటించిన తర్వాత వారిద్దరికి మ్యారేజ్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ తర్వాత వారిద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు రావడంతో వారి ప్రేమకు, పెళ్లికి బ్రేకప్ పడింది. ఆ రెంటికే కాకుండా కొంతకాలం సినిమాలకు కూడా విరామం ఇచ్చింది. ఆ తర్వాత లేడీ విలన్‌గా మంచి మంచి అవకాశాలతో హీరోయిన్‌గా కంటే లేడీ విలన్‌గానే మంచి గుర్తింపును పొందింది. ఈ భామ ఇప్పుడు మళ్లీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. అదీ కూడా తెలుగు సినిమాతో.


అవును వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఏదో కాదు. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘క్రాక్’ చిత్రం. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఒక హీరోయిన్‌ శృతిహాసన్ అనే విషయం తెలిసిందే. రెండో హీరోయిన్‌గా వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తోంది. ఈ చిత్రంతో హీరోయిన్‌గా ఆమెకు మంచి బ్రేక్ వస్తుందని అంటున్నారు. కారణం ఈ సినిమాలో ఆమె పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. శృతిహాసన్ కంటే కూడా ఆమె పాత్రకే వెయిటేజ్ ఎక్కువ ఉంటుందని, ఖచ్చితంగా ఆమెకు ఈ పాత్ర మంచి పేరు తీసుకురావడమే కాకుండా, అవకాశాలు కూడా తెస్తుందని అంటున్నారు.

Updated Date - 2020-06-16T03:12:50+05:30 IST