వనితా విజయ్ కుమార్ భర్తకు గుండెపోటు!

ABN , First Publish Date - 2020-08-27T14:44:28+05:30 IST

నటి, బిగ్‌బాస్ ఫేమ్ వనితా విజయ్ కుమార్ భర్త పీటర్ పాల్ గుండెపోటు కారణంగా చెన్నైలోని ఓ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు.

వనితా విజయ్ కుమార్ భర్తకు గుండెపోటు!

నటి, బిగ్‌బాస్ ఫేమ్ వనితా విజయ్ కుమార్ భర్త పీటర్ పాల్ గుండెపోటు కారణంగా చెన్నైలోని ఓ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. పీటర్ పాల్‌ను వనిత ఇటీవల మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం అత్యంత వివాదాస్పదంగా మారింది. సినీ ప్రముఖులు కూడా వనిత పెళ్లిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 


మంగళవారం సాయంత్రం పీటర్ పాల్‌కు ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే అతణ్ని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు గుండెపోటుగా గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు సోషల్ మీడియా ద్వారా వనిత వెల్లడించారు. 


Updated Date - 2020-08-27T14:44:28+05:30 IST