అక్షయ్‌ సరసన వాణీ కపూర్‌

ABN , First Publish Date - 2020-07-03T05:05:39+05:30 IST

స్టార్‌ హీరో సరసన అవకాశం దక్కితే ఏ కథానాయికైనా ఎగిరి గంతెస్తారు. ప్రస్తుతం అలాంటి ఆనందంలో మునిగితేలుతున్నారు వాణీ కపూర్‌. బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్...

అక్షయ్‌ సరసన వాణీ కపూర్‌

స్టార్‌ హీరో సరసన అవకాశం దక్కితే ఏ కథానాయికైనా ఎగిరి గంతెస్తారు. ప్రస్తుతం అలాంటి ఆనందంలో మునిగితేలుతున్నారు వాణీ కపూర్‌. బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌ సరసన నాయికగా వాణీ ఎంపికయ్యారు. రంజిత్‌ ఎం.తివారీ దర్శకత్వం వహిస్తున్న ‘బెల్‌ బాటమ్‌’ చిత్రంలో అక్షయ్‌ సరసన వాణీకపూర్‌ నటించనున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. అక్షయ్‌కుమార్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి ‘‘చాలా థ్రిల్లింగ్‌గా, ఎగ్జైటింగ్‌గా ఉంది. అక్షయ్‌ సర్‌తో కలిసి నటించడం కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నా’’ అని రాసుకొచ్చారు వాణీ కపూర్‌. 


Updated Date - 2020-07-03T05:05:39+05:30 IST