సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వాళ్ళిద్దరి మధ్య... లవ్వింతే!

ABN, First Publish Date - 2020-06-01T05:55:09+05:30

‘మనసంతా నువ్వే’, ‘నేనున్నాను’ చిత్రాల దర్శకుడు వి.ఎన్‌. ఆదిత్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘వాళ్ళిద్దరి మధ్య’. విరాజ్‌ అశ్విన్‌, నేహా కృష్ణ జంటగా నటించారు. వేదాన్ష్‌ క్రియేటివ్‌ వర్క్స్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘మనసంతా నువ్వే’, ‘నేనున్నాను’ చిత్రాల దర్శకుడు వి.ఎన్‌. ఆదిత్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘వాళ్ళిద్దరి మధ్య’. విరాజ్‌ అశ్విన్‌, నేహా కృష్ణ జంటగా నటించారు. వేదాన్ష్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై అర్జున్‌ దాస్యన్‌ నిర్మించారు. ఫస్ట్‌ కాపీ రెడీ అయింది. ఈ చిత్రంలో ‘లత్కోరు లవ్వింతే’ లిరికల్‌ వీడియో సాంగ్‌ను దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నటీనటులు కొత్తవాళ్లైనా... రూ. 5 కోట్లతో సినిమా తీశాం. నిర్మాత ఎంతో స్వేచ్ఛనిచ్చారు’’ అని వి.ఎన్‌. ఆదిత్య అన్నారు. ‘‘ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటుందీ సినిమా. సిరాశ్రీ మంచి సాహిత్యం అందించారు’’ అని అర్జున్‌ దాస్యన్‌ అన్నారు. సాయిశ్రీనివాస్‌ వడ్లమాని, జయశ్రీ రాచకొండ, వెంకట్‌ సిద్ధారెడ్డి నటించిన ఈ చిత్రానికి సంగీతం: మధు స్రవంతి.

Updated Date - 2020-06-01T05:55:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!