ఒకేసారి ఓటీటీలో, థియేటర్లలో ‘వలస’

ABN , First Publish Date - 2021-01-01T02:18:51+05:30 IST

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా రోడ్డున పడిన వలస కార్మికుల వెతల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. కేవలం వలస కార్మికుల కష్టాలు మాత్రమే

ఒకేసారి ఓటీటీలో, థియేటర్లలో ‘వలస’

కరోనా లాక్‌డౌన్‌తో వలస కార్మికులు అనుభవించిన కష్టాలతో దర్శకుడు పి సునీల్‌ కుమార్‌ రెడ్డి రూపొందించిన చిత్రం 'వలస'. కళాకార్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రాన్ని యెక్కలి రవీంద్రబాబు నిర్మించారు. ఈ చిత్రాన్ని జనవరి 8న ఒకేసారి ఓటీటీ, థియేటర్లలో విడుదల చేస్తున్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. మనోజ్ నందం, తేజు అనుపోజు ఒక జంటగా, వినయ్ మహాదేవ్, గౌరీ మరో జంటగా నటించిన ఈ చిత్రంలో ఎఫ్.ఎం. బాబాయ్, సముద్రం వెంకటేష్, నల్ల శీను, తులసి రామ్, మనీష డింపుల్, తనూషా, మల్లిక తదితరులు ఇతర పాత్రలలో నటించారు.  


ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ''మా చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ద్వారా జనవరి 8వ తేదీన అంతర్జాతీయంగా, అదే రోజున తెలుగు రాష్ట్రాలలో థియేటర్లలోనూ విడుదలకి సిద్ధం చేశాము. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా రోడ్డున పడిన వలస కార్మికుల వెతల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. కేవలం వలస కార్మికుల కష్టాలు మాత్రమే కాకుండా వారి జీవితాలలోని నవరసాలను ఈ చిత్రంలో చూపించాము. ఇందులో ఒక అందమైన ప్రేమ కథతో పాటు ఒక చక్కటి కుటుంబానికి చెందిన కథ ఇమిడి ఉంది. నిజజీవిత హాస్యం, బతుకు పోరాటంలోని ఉగ్వేగం ఇలా అన్ని కోణాలు ఈ సినిమాలో టచ్‌ చేశాము. 'వలస' చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం..'' అని తెలిపారు.

Updated Date - 2021-01-01T02:18:51+05:30 IST