స్త్రీ ఔన‌త్యాన్ని చాటుతున్న ‘మ‌గువా మ‌గువా..’ సాంగ్

ABN , First Publish Date - 2020-03-08T16:10:33+05:30 IST

మార్చి 8..అంత‌ర్జాతీయ‌ మ‌హిళా దినోత్సవం మాన‌వాళి మ‌నుగ‌డ‌కు కార‌ణ‌మైన స్త్రీ మూర్తి గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేస్తూ ప‌లువురు ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా మ‌హిళ‌ల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు.

స్త్రీ ఔన‌త్యాన్ని చాటుతున్న ‘మ‌గువా మ‌గువా..’ సాంగ్

మార్చి 8..అంత‌ర్జాతీయ‌ మ‌హిళా దినోత్సవం

మాన‌వాళి మ‌నుగ‌డ‌కు కార‌ణ‌మైన  స్త్రీ మూర్తి గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేస్తూ ప‌లువురు ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా మ‌హిళ‌ల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్‌సాబ్‌’ సినిమాలో మ‌హిళ‌ల గొప్పత‌నాన్ని తెలియ‌జేసే పాట ‘మ‌గువా మ‌గువా..’ లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. త‌మ‌న్ సంగీతం అందించిన ఈ పాట‌కు రామజోగ‌య్య‌శాస్త్రి సాహిత్యాన్ని అందించ‌గా.. సిద్ శ్రీరామ్ పాట‌ను ఆల‌పించారు. 


‘‘మ‌గువా మ‌గువా 

లోకానికి తెలుసా నీ విలువ‌

మ‌గువా మ‌గువా 

నీ స‌హ‌నానికి స‌రిహ‌ద్దులు క‌ల‌వా

అటు ఇటు అన్నింట జ‌గ‌మే నువ్వంత‌

ప‌రుగులు తీస్తావు ఇంటా బ‌య‌టా


అలుప‌ని ర‌వ్వంత అననే అన‌వంట 

వెలుగులు పుస్తావు వెళ్లే దారంత‌....’’


అంటూ సాగుతున్న ఈ పాట‌లో ప్ర‌తి ప‌దం స్త్రీ మూర్తి గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేసేలా ఉంది. అలాగే ప‌లు రంగాల్లో ఉన్నత శిఖ‌రాల‌ను చేరుకుని, ఎంద‌రికో స్ఫూర్తి ప్ర‌దాయంగా నిలిచిన మ‌ద‌ర్ థెరిసా, స‌రోజినీ నాయుడు, సుధా మూర్తి, సాలుమ‌ర‌ద తిమ్మ‌క్క‌, ఎం.ఎస్‌.సుబ్బ‌ల‌క్ష్మి, ల‌క్ష్మీ అగ‌ర్వాల్‌, క‌ల్ప‌నా చావ్లా, పీవీ సింధు, ల‌తా మంగేష్క‌ర్‌, మిథాలీరాజ్‌, కిర‌ణ్ బేడి, హిమ దాస్ ఫొటోల‌ను కూడా ఈ లిరిక‌ల్ వీడియో సాంగ్‌లో చూపించారు. 


శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా బోనీక‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 15న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. 




Updated Date - 2020-03-08T16:10:33+05:30 IST