ట్విట్టర్‌లో ‘వకీల్‌సాబ్’దే రికార్డ్

ABN , First Publish Date - 2020-12-15T00:29:59+05:30 IST

2020 ఎలోగోలా ముగిసింది. కరోనా దెబ్బతో ఈ ఇయర్‌ ఎలా గడిచిపోతుందా అని అనుకున్నవారే కానీ.. అనుకోని వారు లేరంటే అతిశయోక్తి లేదు. ఎట్టకేలకు 2020ని ముగించేసి

ట్విట్టర్‌లో ‘వకీల్‌సాబ్’దే రికార్డ్

2020 ఎలోగోలా ముగిసింది. కరోనా దెబ్బతో ఈ ఇయర్‌ ఎలా గడిచిపోతుందా అని అనుకున్నవారే కానీ.. అనుకోని వారు లేరంటే అతిశయోక్తి లేదు. ఎట్టకేలకు 2020ని ముగించేసి.. ఇంకొన్ని రోజుల్లో 2021లోకి అడుగుపెట్టబోతున్నాం. ఇక 2020కి సంబంధించిన ట్విట్టర్‌ లెక్కలను ఒక్కొక్కటిగా ట్విట్టర్‌ ఇండియా బయటపెడుతుంది. ఏ హీరో, హీరోయిన్‌ పేరు బాగా ట్రెండ్‌ అయ్యింది, ఏ సినిమా పేరు టాప్‌ స్థానాన్ని ఆక్రమించిదనే లెక్కలను తాజాగా ట్విట్టర్‌ విడుదల చేసింది. అందులో తెలుగు సినిమా విషయానికి వస్తే.. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ 'వకీల్‌సాబ్‌' చిత్రం టాప్‌ స్థానం కైవసం చేసుకుంది. మోస్ట్ ట్విట్‌డ్‌ తెలుగు మూవీ ఇన్‌ 2020గా 'వకీల్‌సాబ్‌' చిత్రం టాప్‌ ప్లేస్‌లో నిలిచినట్లుగా ట్విట్టర్‌ ఇండియా ప్రకటించింది. 'వకీల్‌సాబ్‌'కి సంబంధించి ఒక మోషన్‌ పోస్టర్‌, ఒక పాట మాత్రమే ఇప్పటి వరకు విడుదలయ్యాయి. కేవలం ఈ రెండింటితోనే ఈ సినిమా టాప్‌ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ.. ట్విట్టర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Updated Date - 2020-12-15T00:29:59+05:30 IST

Read more