వెబ్‌ సిరీస్‌లో వడివేలు!

ABN , First Publish Date - 2020-08-02T16:18:05+05:30 IST

వడివేలు దర్శకుడు సురాజ్‌ను కలుసుకుని సినిమాకు బదులుగా అదే కథతో వెబ్‌ సిరీస్‌ నిర్మించమని సలహా ఇచ్చారు. సురాజ్‌ ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌కు అనుగుణంగా కథలో మార్పులు చేస్తున్నారు.

వెబ్‌ సిరీస్‌లో వడివేలు!

ప్రముఖ హాస్యనటుడు వడివేలు ఓ వెబ్‌ సిరీస్‌లో హీరోగా నటించనున్నారు. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ నిర్మించాలనుకున్న ‘ఇమ్‌సై అరసన్‌ 24 పులికేశి-2‘లో వడివేలును హీరోగా ఎంపిక చేశారు. శంకర్‌తో మనస్పర్థలు తలెత్తడంతో వడివేలు ఆ చిత్రంలో నటించేందుకు అంగీకరించక పోవడంతో నిర్మాతల సంఘం ఆయన్ను ఇతర చిత్రాలలో నటించకుండా నిషేధించిది. దీంతో కొన్నేళ్లుగా వడివేలు సినీ రంగానికి దూరమయ్యారు. ఇటీవల కమల్‌హాసన్‌ నటించనున్న ‘తలైవన్‌ ఇరుక్కిండ్రాన్‌’ చిత్రంలో నటించేందుకు వడివేలుకు అవకాశం లభించింది. కానీ కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా ఆ చిత్ర నిర్మాణం ఆగిపోయింది. 


ఈక్రమంలో సురాజ్‌ దర్శకత్వంలో వడివేలు నటించేందుకు అంగీకరించారు. లాక్‌డౌన్‌ ముగిశాక షూటింగ్‌ ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వడివేలు దర్శకుడు సురాజ్‌ను కలుసుకుని సినిమాకు బదులుగా అదే కథతో వెబ్‌ సిరీస్‌ నిర్మించమని సలహా ఇచ్చారు. సురాజ్‌ ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌కు అనుగుణంగా కథలో మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే తమిళ సినీరంగంలో సత్యరాజ్‌, ప్రసన్న, భరత్‌, బాబీసిన్హా, సీతా, కాజల్‌ అగర్వాల్‌, తమన్నా, నిత్యామేనన్‌, ప్రియాభవానీ శంకర్‌, ప్రియమణి తదితరులు వెబ్‌ సిరీస్‌లో సీరియస్‌గా నటిస్తున్నారు. వారి బాటలోనే వడివేలు కూడా పూర్తి హాస్యభరితమైన సన్నివేశాలతో కొత్త వెబ్‌ సిరీస్‌లో నటించనున్నారు.

Updated Date - 2020-08-02T16:18:05+05:30 IST