ఆయ‌న ఇంటిపేరే విక్ట‌రీ అయ్యింది: నటి జీవిత

ABN , First Publish Date - 2020-06-15T04:22:40+05:30 IST

ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు.. మ‌ధు ఫిలిం ఇనిస్టిట్యూట్ అధినేత వి. మ‌ధుసూధ‌న‌రావు 97వ జ‌యంతి సంద‌ర్భంగా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆయ‌న‌ను సంస్మ‌రించుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో

ఆయ‌న ఇంటిపేరే విక్ట‌రీ అయ్యింది: నటి జీవిత

ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు.. మ‌ధు ఫిలిం ఇనిస్టిట్యూట్ అధినేత వి. మ‌ధుసూధ‌న‌రావు 97వ జ‌యంతి సంద‌ర్భంగా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆయ‌న‌ను సంస్మ‌రించుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, మా అధ్య‌క్షుడు న‌రేష్, సెక్రటరీ జీవిత రాజ‌శేఖ‌ర్, ట్రెజరర్ రాజీవ్ క‌న‌కాల‌, ప్ర‌స‌న్న‌కుమార్, వాణీ మ‌ధుసూద‌న్, ప్రసాదరావు, సురేష్ కొండేటి త‌దిత‌రులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా నటి జీవిత రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. ‘‘వి. మ‌ధుసూధ‌న‌రావు గారి ఇంటిపేరు వీర‌మాచినేని. ఆయ‌న ఇంటిపేరే విక్ట‌రీ అయ్యింది. ఆయ‌న సినిమా తీస్తూ ప్ర‌జ‌ల‌కు మంచి చెప్పాల‌న్న ఆలోచ‌న చేసేవారు. ఆయ‌న చేసిన ప్ర‌తి సినిమాలో చ‌క్క‌ని సందేశం ఉండేది’’ అన్నారు.


రాజీవ్ క‌న‌కాల మాట్లాడుతూ.. ‘‘మొద‌టిసారి ఏపీలో హైద‌రాబాద్ ఫిలిం ఇనిస్టిట్యూట్ ప్రారంభ‌మైంది. రామారావుగారు ఓపెన్ చేసిన తొలి ఫిలింఇనిస్టిట్యూట్. ఆ ఇనిస్టిట్యూష‌న్ లోనే నాన్న‌గారు ఫౌండ‌ర్ ప్రిన్సిప‌ల్‌గా ప‌ని చేశారు. ఆ ఇనిస్టిట్యూట్‌తో గొప్ప అనుబంధం ఉంది. అలాంటి గొప్ప ద‌ర్శ‌కుడి గురించి మాట్లాడే అవ‌కాశం అదృష్టం ద‌క్కినందుకు అదృష్టంగా భావిస్తున్నా. మ‌ధు గారి 97వ పుట్టిన‌రోజు ఇది. వందో పుట్టిన‌రోజు ఇలానే ఘ‌నంగా జ‌రుపుకుంటామ‌ని ఆశిస్తున్నాను’’ అన్నారు.


వి. మ‌ధుసూద‌న రావు కుమార్తె వాణీ మాట్లాడుతూ.. ‘‘నాన్న‌గారు ప‌రిశ్ర‌మ‌కు ఏదో ఒక‌టి చేయాల‌ని అనుకునేవారు. మ‌ద్రాసు నుంచే ఆర్టిస్టుల్ని తెచ్చుకోవాలా? అన్న ప‌ట్టుద‌ల‌తో ఇక్క‌డ ఇనిస్టిట్యూట్ ప్రారంభించారు. విద్యార్థుల‌తోనే ఇనిస్టిట్యూట్ సంద‌డిగా ఉండేది. ఇప్ప‌టికీ ఆ వేడుక క‌నిపిస్తోంది. ఆయ‌న‌ ఆత్మ ఇంకా ఇండ‌స్ట్రీ కోసం త‌ప‌న ప‌డుతోంది’’ అని అన్నారు.

Updated Date - 2020-06-15T04:22:40+05:30 IST