కంగనకు అంత ప్రాధాన్యం అనవసరం: ఊర్మిళ

ABN , First Publish Date - 2020-12-03T01:25:23+05:30 IST

కంగనా రనౌత్‌కు అందరూ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఆమె గురించి అంతలా మాట్లాడుకోవడం అనవసరమని

కంగనకు అంత ప్రాధాన్యం అనవసరం: ఊర్మిళ

కంగనా రనౌత్‌కు అందరూ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఆమె గురించి అంతలా మాట్లాడుకోవడం అనవసరమని బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఊర్మిళా మతోంద్కర్‌ పేర్కొన్నారు. ఊర్మిళను `సాఫ్ట్ పోర్న్‌స్టార్`గా అభివర్ణిస్తూ కంగన గతంలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు ఊర్మిళ అప్పట్లోనే కౌంటర్ ఇచ్చారు. 


ఊర్మిళ తాజాగా శివసేనలో చేరారు. ఈ నేపథ్యంలో కంగనకు గురించి ఊర్మిళకు ప్రశ్నలు ఎదురయ్యాయి. `కంగనా రనౌత్‌కు అందరూ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆమె గురించి ఇంతలా మాట్లాడుకోవడం అనవసరం. ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది. అందులో భాగంగానే ఆమె కూడా విమర్శలు చేస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో కంగన గురించి అడిగినప్పుడు కూడా నేను స్పందించలేదు. ఇప్పుడూ కూడా ఆమె గురించి మాట్లాడేందుకు ఏమీ లేద`ని ఊర్మిళ పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-03T01:25:23+05:30 IST