ఉపేంద్ర ‘కబ్జ’ మోషన్ పోస్టర్ విడుదల

ABN , First Publish Date - 2020-11-17T02:12:29+05:30 IST

‘ఏ, ఉపేంద్ర, రక్తకన్నీరు, బుద్ధిమంతుడు, సూపర్’ వంటి వైవిధ్యభరిత చిత్రాలతో కన్నడ ప్రేక్షకులకే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడయ్యాడు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర

ఉపేంద్ర ‘కబ్జ’ మోషన్ పోస్టర్ విడుదల

‘ఏ, ఉపేంద్ర, రక్తకన్నీరు, బుద్ధిమంతుడు, సూపర్’ వంటి వైవిధ్యభరిత చిత్రాలతో కన్నడ ప్రేక్షకులకే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడయ్యాడు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో అల్లు అర్జున్‌కి పోటాపోటీగా నటించిన ఉపేంద్ర.. తెలుగులో వైవిధ్యభరిత పాత్రలు వస్తే చేయడానికి సిద్ధమంటూ ఆ మధ్య ఓపెన్ ఆఫర్ ఇచ్చేశాడు. ఇక ‘కె.జి.యఫ్’ సాధించిన విజయం తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. తెలుగు ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. దీంతో ఇప్పుడు ఉపేంద్ర నటించిన ‘కబ్జ’ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. 


ఆయన హీరోగా శ్రీ సిద్దేశ్వరా ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై.. లాంకో శ్రీధర్ సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కబ్జ’. ఉపేంద్ర పుట్టినరోజున విడుదల చేసిన ఈ చిత్ర థీమ్ పోస్టర్.. మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్‌లో యాక్షన్ మూడ్‌లో సీరియస్ లుక్‌లో ఉన్న ఉపేంద్ర బండి మీద తను చావబాదిన రౌడీని తీసుకెళుతున్నాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయేలా ఉంది. తెలుగులో సుధీర్ బాబుతో ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఆర్. చంద్రు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ‘కె.జి.ఎఫ్’ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. కన్నడ, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, ఒరియా మరియు మరాఠీ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది.Updated Date - 2020-11-17T02:12:29+05:30 IST