మెగా హీరో సినిమాను క‌న్‌ఫ‌ర్మ్ చేసిన ఉపేంద్ర‌

ABN , First Publish Date - 2020-04-28T17:39:29+05:30 IST

వ‌రుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం. ఇందులో ఉపేంద్ర కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నాన‌ని తెలిపారు.

మెగా హీరో సినిమాను క‌న్‌ఫ‌ర్మ్ చేసిన ఉపేంద్ర‌

అల్లు అర్జున్ హీరోగా న‌టించిన ‘స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి’లో కీల‌క పాత్ర‌లో నటించిన క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ ఉపేంద్ర త‌ర్వాత మ‌రో తెలుగు సినిమాలో న‌టించలేదు. చాలా గ్యాప్ త‌ర్వాత ఆయ‌న మ‌రో తెలుగు సినిమాలో న‌టించ‌బోతున్న‌ట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ తెలుగు సినిమా ఏదో కాదు.. వ‌రుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం. ఇందులో ఉపేంద్ర కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నాన‌ని తెలిపారు. క‌రోనా ప్ర‌భావంతో ఈ సినిమా వైజాగ్ షెడ్యూల్ వాయిదా ప‌డింది. దీంతో జూలై 30న విడుద‌ల చేద్దామ‌నుకున్న సినిమా వాయిదా ప‌డేలా ఉంది. ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ బాక్స‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. బాలీవుడ్ బ్యూటీ స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

Updated Date - 2020-04-28T17:39:29+05:30 IST