రికార్డ్ క్రియేట్ చేసిన ‘ఉప్పెన’ సాంగ్‌

ABN , First Publish Date - 2020-05-11T18:08:30+05:30 IST

సాయితేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, క్రితి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఉప్పెన‌’. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకాల‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రికార్డ్ క్రియేట్ చేసిన ‘ఉప్పెన’ సాంగ్‌

సాయితేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, క్రితి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఉప్పెన‌’. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకాల‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించారు. ఆయ‌న సంగీత సార‌థ్యంలో ఇప్ప‌టి వ‌రకు రెండు పాట‌లు విడుద‌లైతే రెండింటికీ మంచి ఆద‌ర‌ణ ద‌క్కాయి. ఈ రెండు సాంగ్స్‌లో ముఖ్యంగా ‘నీ క‌ళ్లు నీలి స‌ముద్రం..’ సాంగ్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సాంగ్‌కు 50 మిలియ‌న్స్ వ్యూస్ రావ‌డం విశేషం. కోలీవుడ్ విలక్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ఇందులో విల‌న్‌గా న‌టించారు. ఏప్రిల్ 2న విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం క‌రోనా ప్ర‌భావంతో వాయిదా ప‌డింది. తాజా స‌మాచారం మేర‌కు సినిమాను డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేస్తార‌ని అంటున్నారు. 

Updated Date - 2020-05-11T18:08:30+05:30 IST