`ఆర్ఆర్ఆర్`.. అప్‌డేట్ వచ్చేస్తోంది!

ABN , First Publish Date - 2020-10-05T22:04:03+05:30 IST

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానుల ఎదురు చూపులకు తెరపడనుంది.

`ఆర్ఆర్ఆర్`.. అప్‌డేట్ వచ్చేస్తోంది!

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానుల ఎదురు చూపులకు తెరపడనుంది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న `ఆర్ఆర్ఆర్` సినిమాకు సంబంధించిన అప్‌డేట్ రాబోతోంది. మంగళవారం ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇవ్వబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది. రామ్‌చరణ్, ఎన్టీయార్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. అత్యంత భారీ బడ్జెట్‌తో దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.


కరోనా కారణంగా ఏడు నెలల క్రితం ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ప్రభుత్వం నుంచి అనుమతులు లభించినా చిత్రీకరణకు వందల మంది అవసరం కాబట్టి ఇప్పటివరకు షూటింగ్ ప్రారంభించలేదు. ఎట్టకేలకు సోమవారం ఈ సినిమా టెస్ట్ షూట్ హైదరాబాద్‌లో జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ, `ఆర్ఆర్ఆర్` టీమ్ అందించే అప్‌డేట్ ఏంటో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే. 
Updated Date - 2020-10-05T22:04:03+05:30 IST

Read more