అందుకే అతడు నా హీరో: ఉపాసన
ABN , First Publish Date - 2020-04-16T19:55:33+05:30 IST
కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఇళ్లకే పరిమితమైన హీరోలు సమయాన్ని సరదాగా గడుపుతున్నారు.

కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఇళ్లకే పరిమితమైన హీరోలు సమయాన్ని సరదాగా గడుపుతున్నారు. చాలా మంది వంట చేస్తున్నారు. తాజాగా మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ తన భార్య ఉపాసన కోసం వంట చేశాడు. రాత్రి భోజనాన్ని తయారు చేసి కిచెన్ కూడా శుభ్రం చేశాడట.
ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. `ప్రియమైన భార్య కోసం రామ్‌చరణ్ భోజనం తయారు చేస్తున్నారు. వంట చేసిన తర్వాత ఆయనే వంట గదిని శుభ్రం చేశారు. ఆయన నా హీరో కావడానికి కారణమిదే` అంటూ ఉపాసన కామెంట్ చేశారు. చెర్రీ వంట చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.