చరణ్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు: ఉపాసన

ABN , First Publish Date - 2020-12-30T17:04:57+05:30 IST

టాలీవుడ్‌ను కరోనా టెన్షన్ పెడుతోంది. మెగా ఫ్యామిలీకి చెందిన రామ్‌చరణ్, వరుణ్ తేజ్ తాజాగా కరోనా బారిన పడ్డారు.

చరణ్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు: ఉపాసన

టాలీవుడ్‌ను కరోనా టెన్షన్ పెడుతోంది. మెగా ఫ్యామిలీకి చెందిన రామ్‌చరణ్, వరుణ్ తేజ్ తాజాగా కరోనా బారిన పడ్డారు. దీంతో ఇటీవల వీరిని కలిసిన వారందరూ టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం వీరు హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. చెర్రీ ఆరోగ్యం గురించి ఆయన భార్య ఉపాసన ట్వీట్ చేశారు. తనకు నెగిటివ్ వచ్చినప్పటికీ, చెర్రీతోపాటు తను కూడా క్వారంటైన్‌ అయినట్టు తెలిపారు. 


`ఇది కూడా వెళ్లిపోతుంది. కొత్త సంవత్సరం బాగుంటుందని ఆశిస్తున్నా. మిస్టర్ సి (చరణ్)కి ఎలాంటి లక్షణాలూ లేవు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. నాకు నెగిటివ్ వచ్చింది. అయితే నాకు కూడా పాజిటివ్ వచ్చేందుకు చాలా అవకాశాలున్నాయి. ప్రస్తుతం చెర్రీతో కలిసి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నా. వేడి వేడి ద్రవాలు, ఆవిరి, విశ్రాంతి తీసుకుంటున్నామ`ని ఉపాసన పేర్కొన్నారు. ఆరు బయట చెర్రీతో కలిసి కూర్చుని ఉన్న చిన్న వీడియోను పోస్ట్ చేశారు. Updated Date - 2020-12-30T17:04:57+05:30 IST