అన్‌లాక్ 5.0: సినిమా థియేటర్లకు గ్రీన్ సిగ్నల్!

ABN , First Publish Date - 2020-10-01T01:59:52+05:30 IST

దాదాపు ఆరు నెలలుగా మూత బడిన సినిమా థియేటర్లు త్వరలోనే తెరుచుకోబోతున్నాయి.

అన్‌లాక్ 5.0: సినిమా థియేటర్లకు గ్రీన్ సిగ్నల్!

దాదాపు ఆరు నెలలుగా మూతబడిన సినిమా థియేటర్లు త్వరలోనే తెరుచుకోబోతున్నాయి. కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌కు కేంద్ర ప్రభుత్వం క్రమంగా సడలింపులు ఇస్తున్న విషయం తెలిసిందే. 


సెప్టెంబర్ 30తో నాలుగో దశ అన్‌లాక్ ముగుస్తున్న నేపథ్యంలో మరికొన్ని సడలింపులతో కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకునే వెసులుబాటు కల్పించింది. అయితే 50 శాతం సీట్లు సామర్థ్యంతో మాత్రమే థియేటర్లను నడపాలని సూచించింది. 

Updated Date - 2020-10-01T01:59:52+05:30 IST