సినిమా హాళ్లు తెరవడంపై అభిషేక్ ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2020-10-01T16:35:25+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించారు. తదనంతర కాలంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించారు.

సినిమా హాళ్లు తెరవడంపై అభిషేక్ ఏమన్నారంటే...

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించారు. తదనంతర కాలంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించారు. తాజాగా కేంద్ర హోంశాఖ అన్‌లాక్-5కు సంబంధించిన గైడ్‌లైన్స్ విడుదల చేసింది. దీని ప్రకారం అక్టోబరు 15 నుంచి సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతినిచ్చింది. అయితే 50 శాతం ప్రేక్షకులతో థియేటర్లు తెరవాలని సూచించింది. దీనిపై బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ స్పందించారు. ఈ వార్త విన్నంతనే తనకు ఎంతో ఆనందం కలిగిందన్నారు. ‘ఈ వారంలో ఇదే మంచి వార్త‘ అని ట్వీట్ చేశారు. దీనిని చూసిన అభిషేక్ అభిమానులు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా థియేటర్లు తెరవనున్నారన్నవార్త కేవలం నటులకే కాకుండా ప్రేక్షకులకు కూడా ఆనందం కలిగించేదిగా మారింది. బాలీవుడ్‌లో నిర్మాణం పూర్తిచేసుకున్న ‘సూర్యవంశీ’, ‘83’ తదితర సినిమాలు విడుదల కోసం ఎదురు చూస్తున్నాయి. 


Updated Date - 2020-10-01T16:35:25+05:30 IST