సోనూసూద్‌కు అరుదైన పురస్కారం

ABN , First Publish Date - 2020-09-29T22:35:10+05:30 IST

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ అరుదైన పురస్కారం అందుకున్నారు. సోమవారం 'అల్లుడు అదుర్స్' చిత్ర యూనిట్‌ సోనూసూద్‌ను సన్మానించిన విషయం

సోనూసూద్‌కు అరుదైన పురస్కారం

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ అరుదైన పురస్కారం అందుకున్నారు. సోమవారం 'అల్లుడు అదుర్స్' చిత్ర యూనిట్‌ సోనూసూద్‌ను సన్మానించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ రియల్‌ హీరోను ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుతో సత్కరించింది. తను చేస్తున్న సహాయ కార్యక్రమాలతో అంతర్జాతీయ గుర్తింపును పొందిన సోనూసూద్‌కు ఈ అరుదైన పురస్కారం లభించడంతో.. ఆయన అభిమానులే కాక ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తుండటం విశేషం.


కరోనా.. కొన్ని నెలలుగా విపరీతంగా వినిపిస్తున్న, వణికిస్తున్న పేరు. అయితే ఈ కరోనా కారణంగా కొంత మేలు కూడా జరిగింది. ఏంటా మేలు అనే విషయానికి వస్తే.. కరోనా కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌లో అసలైన హీరోలెవరో బయటి ప్రపంచానికి తెలిసింది. ఆపదలో ఉన్నప్పుడు తామున్నామంటూ ఎందరో.. ఈ లాక్‌డౌన్‌లో పేదలను, కష్టాలలో ఉన్నవారిని ఆదుకున్నారు. అందులో ముఖ్యంగా ఈ లాక్‌డౌన్‌లో విపరీతంగా వినిపించిన పేరు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌. సహాయం కావాలి అని కనిపిస్తే చాలు.. వెంటనే రియాక్ట్ అవుతూ.. ఇప్పటికీ ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తున్నారు సోనూసూద్‌. నిస్వార్థంతో ఆయన చేసిన సేవా కార్యక్రమాలే ఆయనకీ గౌరవం దక్కేలా చేశాయని చెప్పడంలో అతిశయోక్తిలేదు.

Updated Date - 2020-09-29T22:35:10+05:30 IST