`ఉమామహేశ్వర ఉగ్రరూపస్య`పై సినీ ప్రముఖుల ప్రశంసలు!

ABN , First Publish Date - 2020-07-31T03:12:46+05:30 IST

`కేరాఫ్ కంచరపాలెం` సినిమాతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వెంకటేశ్ మహా రూపొందించిన రెండో చిత్రం `ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

`ఉమామహేశ్వర ఉగ్రరూపస్య`పై సినీ ప్రముఖుల ప్రశంసలు!

`కేరాఫ్ కంచరపాలెం` సినిమాతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వెంకటేశ్ మహా రూపొందించిన రెండో చిత్రం `ఉమామహేశ్వర ఉగ్రరూపస్య`. సత్యదేవ్, హరిచందన హీరోహీరోయిన్లుగా నటించారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.  


చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది . సత్య ఇరగదీసాడు. నరేష్‌గారు, హీరోయిన్, ఇతర నటీనటులందరూ బాగా నటించారు. డైరెక్షన్, సంగీతం చాలా బాగున్నాయి. చిత్రబృందం మొత్తానికి ధన్యవాదాలు       - దర్శకుడు పూరీ జగన్నాథ్


ఇప్పుడే `ఉమామహేశ్వర ఉగ్రరూపస్య` సినిమా చూశాను. `కేరాఫ్ కంచరపాలెం` దర్శకుడి నుంచి మరో మంచి ఫీల్ ఉన్న సినిమా. సినిమాలో చాలా మంచి సన్నివేశాలున్నాయి. సంగీతం హృద్యంగా ఉంది      - ఎమ్ఎమ్ కీరవాణి


`ఉమామహేశ్వర ఉగ్రరూపస్య` చాలా అందమైన సినిమా. అనుమతులు లభించిన తర్వాత థియేటర్లలో కూడా ఈ సినిమాను విడుదల చేయాలి. సినిమాలోని కొన్ని సన్నివేశాలను పెద్ద తెరపై కూడా చూడాలనుకుంటున్నా. డైరెక్టర్ వెంకటేష్ మహా నిజాయితీకి ధన్యవాదాలు. సత్యదేవ్‌కు పెద్ద అభిమానిని. సుహాస్ చాలా బాగా చేశాడు      - హీరో నాని


Updated Date - 2020-07-31T03:12:46+05:30 IST