‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’.. శాటిలైట్ రైట్స్ రికార్డ్

ABN , First Publish Date - 2020-08-08T04:35:51+05:30 IST

తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘బాహుబ‌లి’. తెలుగు సినిమా ప్రేక్ష‌కులు గ‌ర్వ‌ప‌డే ఈ గొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్

‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’.. శాటిలైట్ రైట్స్ రికార్డ్

తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘బాహుబ‌లి’. తెలుగు సినిమా ప్రేక్ష‌కులు గ‌ర్వ‌ప‌డే ఈ గొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని. అంత భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన ఈ నిర్మాత‌లు అందించిన మ‌రో కంటెంట్ బేస్డ్ మూవీ ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’. ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై  శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా ‘కేరాఫ్ కంచ‌పాలెం’ ఫేమ్ వెంక‌టేశ్ మ‌హ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందింది. మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం ‘మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. స‌త్య‌దేవ్ హీరోగా న‌టించారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంటోంది. అంతేకాకుండా టాలీవుడ్ సెలబ్రిటీలందరూ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ చిత్రం ఓ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. 


ఈ చిత్ర శాటిలైట్ రైట్స్.. చిత్ర బడ్జెట్ కంటే ఎక్కువ ధరకు అమ్ముడు పోవడం విశేషం. దీంతో చిత్రయూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ రూ. 2.5 కోట్లకు ఈటీవీ సొంతం చేసుకున్నట్లుగా సమాచారం. అంతేకాదు, చాలా గ్యాప్ తర్వాత ఈటీవీ ఈ చిత్ర రైట్స్‌ను తీసుకోవడం విశేషం. ప్రస్తుతం నడుస్తున్న కష్టకాలంలో రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రానికి శాటిలైట్ రైట్స్ రూపంలోనే రూ. 2.5 కోట్లు రావడం అంటే మాములు విషయం కాదు. అందుకే ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’ ఓటీటీ బ్లాక్‌బస్టర్ అని టాలీవుడ్ అంతా చెప్పుకుంటోంది.

Updated Date - 2020-08-08T04:35:51+05:30 IST

Read more