రెండు భవనాలు.. 200 కోట్లు!

ABN , First Publish Date - 2020-09-28T05:55:45+05:30 IST

ఒకప్పటి బాలీవుడ్‌ అగ్రనటులు దిలీప్‌ కుమార్‌, దివంగత రాజ్‌కపూర్‌ల పూర్వీకులకు చెందిన పురాతన భవనాలను పాకిస్థాన్‌లోని ఖైబర్‌ ఫక్తూన్‌క్వా ప్రభుత్వం కొనుగోలు చేయాలని...

రెండు భవనాలు.. 200 కోట్లు!

ఒకప్పటి బాలీవుడ్‌ అగ్రనటులు దిలీప్‌ కుమార్‌, దివంగత రాజ్‌కపూర్‌ల పూర్వీకులకు చెందిన పురాతన భవనాలను పాకిస్థాన్‌లోని ఖైబర్‌ ఫక్తూన్‌క్వా ప్రభుత్వం కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. పాక్తిస్థాన్‌లోని పెషావర్‌లో శిథిలావస్థలో ఉన్న ఆ రెండు భవంతులను కూల్చివేయాలని గతంలో ప్రయత్నాలు జరిగినా పురావస్తు శాఖ అడ్డుపడింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉండి, జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించబడ్డ ఆ భవనాలను యాజమానుల నుంచి కొనుగోలు చేసి పరిరక్షించేందుకు నిధులను విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే యజమానులు రెండు భవంతులకు రూ.200 కోట్లు డిమాండ్‌ చేస్తున్నారని ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2020-09-28T05:55:45+05:30 IST