‘గబ్బర్‌సింగ్’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్ షేకవుతోంది

ABN , First Publish Date - 2020-05-11T02:52:42+05:30 IST

సోషల్ మీడియా ట్విట్టర్‌ ఇప్పుడు పవన్ కల్యాణ్ ‘గబ్బర్‌సింగ్’ హ్యాష్‌ట్యాగ్‌తో షేకవుతుంది. మే 11వ తేదీకి ఈ చిత్రం విడుదలై 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా

‘గబ్బర్‌సింగ్’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్ షేకవుతోంది

సోషల్ మీడియా ట్విట్టర్‌ ఇప్పుడు పవన్ కల్యాణ్ ‘గబ్బర్‌సింగ్’ హ్యాష్‌ట్యాగ్‌తో షేకవుతుంది. మే 11వ తేదీకి ఈ చిత్రం విడుదలై 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమానులు ఓ ట్యాగ్‌ని విడుదల చేశారు. 8ఇయర్స్ఆఫ్‌గబ్బర్‌సింగ్‌హిస్టీరియా అనే ట్యాగ్‌తో అభిమానులు సోషల్ మీడియాలో గబ్బర్‌సింగ్ విషయాలను షేర్ చేస్తున్నారు. దీనికి నిర్మాత బండ్ల గణేష్, హరీష్ శంకర్, హైపర్ ఆది వంటి వారందరూ తోడవడంతో పవన్ అభిమానుల సంతోషానికి అవధులే లేవు. 


ఇక ఈ ట్యాగ్ ట్విట్టర్‌లో సృష్టిస్తున్న హడావుడికి అంతకుముందు ఉన్న ఇలాంటి రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. కేవలం 33 నిమిషాల్లో ఈ ట్యాగ్ 1 మిలియన్ ట్వీట్స్‌ని రీచ్ అయింది. 67 నిమిషాల్లో 2 మిలియన్, రెండు గంటల్లో 3 మిలియన్ ట్వీట్స్‌ని రీచ్ అయింది. దీంతో పాటు వకీల్‌సాబ్ ట్యాగ్ కూడా మిలియన్ ట్వీట్స్ రీచ్ అవ్వడం విశేషం. గబ్బర్‌సింగ్ సినిమాలోని డైలాగ్స్, స్టిల్స్‌ని షేర్ చేస్తూ.. పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

Updated Date - 2020-05-11T02:52:42+05:30 IST