టీవీ స్టార్ దిషా పర్మార్‌కు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-09-24T15:33:16+05:30 IST

టీవీ స్టార్ దిషా పర్మార్ కు కరోనా వైరస్ సోకింది....

టీవీ స్టార్ దిషా పర్మార్‌కు కరోనా పాజిటివ్

ముంబై : టీవీ స్టార్ దిషా పర్మార్ కు కరోనా వైరస్ సోకింది. తనకు కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో వెల్లడైందని టెలివిజన్ నటి దిషా పర్మార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది.తన ప్రియుడైన గాయకుడు రాహుల్ పుట్టిన రోజు అయినా కరోనా కారణంగా తాను అతన్ని కలవలేక పోతున్నానని దిషా పేర్కొంది.‘‘మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’’ అంటూ రాహుల్ కు దిషా ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది.తనకు కరోనా సోకినా తాను సానుకూలంగా ఉండటం వల్ల భయం అనిపించలేదని దిషా పేర్కొన్నారు.దిషా పర్మార్ తల్లికి గత పదిరోజుల క్రితం కరోనా వైరస్ సోకింది.

Updated Date - 2020-09-24T15:33:16+05:30 IST