మరో నటుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-08-07T05:08:04+05:30 IST

బుల్లితెర నటుడు సమీర్‌ శర్మ (44) ముంబైలోని సొంతింటిలో మరణించినట్టు గురువారం పోలీసులు తెలిపారు. అతని మృతికి గల కారణాలు తెలియలేదు. సోమ లేదా మంగళవారాల్లో....

మరో నటుడి ఆత్మహత్య

బుల్లితెర నటుడు సమీర్‌ శర్మ (44) ముంబైలోని సొంతింటిలో మరణించినట్టు గురువారం పోలీసులు తెలిపారు. అతని మృతికి గల కారణాలు తెలియలేదు. సోమ లేదా మంగళవారాల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సూసైడ్‌ నోట్‌ వంటిదీ ఏదీ అతని ఇంటిలో లభించలేదని వారు తెలిపారు. హిందీలో ‘క్యూంకీ సాస్‌ భీ కభీ బహు థీ’, ‘కహానీ ఘర్‌ ఘర్‌ కి’, ‘యే రిష్తే హై ప్యార్‌ కె’ తదితర సీరియళ్లల్లో సమీర్‌ శర్మ నటించారు. అతని మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. బుల్లితెర నటుడు మన్‌మీత్‌ గ్రేవాల్‌, హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ తర్వాత మరో ఆత్మహత్య చోటు చేసుకోవడంతో హిందీ చలనచిత్ర, టీవీ పరిశ్రమ కలవరపాటుకు గురైంది. ఈ ఆత్మహత్యలకు తోడు అనారోగ్యాలతో ప్రముఖులు పైలోకాలకు వెళ్లడం ప్రేక్షకులతో పాటు పరిశ్రమ ప్రముఖులను బాధిస్తోంది.

Updated Date - 2020-08-07T05:08:04+05:30 IST