‘శరారత్’ నటి శ్రుతి సేథ్‌కు అత్యవసర శస్త్రచికిత్స
ABN , First Publish Date - 2020-12-30T00:56:51+05:30 IST
‘శరారత్’ టీవీ షోతో బోల్డంత పాపులారిటీ సంపాదించుకున్న నటి శ్రుతి సేథ్‌కు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆరోగ్యపరమైన

ముంబై: ‘శరారత్’ టీవీ షోతో బోల్డంత పాపులారిటీ సంపాదించుకున్న నటి శ్రుతి సేథ్‌కు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆరోగ్యపరమైన సమస్యల కారణంగా అత్యవసరంగా శస్త్రచికిత్స చేయించుకున్నట్టు శ్రుతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను కూడా షేర్ చేసింది. 2020లో తన కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నదీ చెప్పిన శ్రుతి.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ బయటకు రావొద్దని, ఆరోగ్యాన్ని పణంగా పెట్టవద్దని హెచ్చరించింది.
2020 తనకు, తన కుటుంబానికి చివరి షాక్ ఇచ్చిందని పేర్కొంది. అత్యవసర సర్జరీతో ఈ ఏడాది ముగస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. తన న్యూ ఇయర్ ట్రావెల్ ప్లాన్స్ అన్నింటినీ రద్దు చేసుకున్నట్టు తెలిపింది. ఓ పెద్ద ఆరోగ్య సమస్య నుంచి బయటపడినందుకు కృతజ్ఞతలు చెప్పిన శ్రుతి.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది.