టీవీ నటికి కరోనా

ABN , First Publish Date - 2020-07-03T05:08:00+05:30 IST

బుల్లితెర నటి నవ్య స్వామికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ‘నా పేరు మీనాక్షీ’, ‘ఆమె కథ’ సీరియల్స్‌తో అలరిస్తున్న...

టీవీ నటికి కరోనా

బుల్లితెర నటి నవ్య స్వామికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ‘నా పేరు మీనాక్షీ’, ‘ఆమె కథ’ సీరియల్స్‌తో అలరిస్తున్న ఆమె ఈ మేరకు ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ‘‘కరోనా సోకినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. సిగ్గు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. వీలైనంత పాజిటివ్‌గా ఉండటానికి ట్రై చేయండి. పలు జాగ్రత్తలు తీసుకోండి. మీ చుట్టు పక్కల వారికి  కరోనా పాజిటివ్‌ అని తెలిసినా విచారించాల్సిన అవసరం లేదు. హోం క్వారంటైన్‌లో ఉండండి. మీతోటి వారికి దూరంగా ఉండండి. అప్పుడే త్వరగా కోలుకోగలం. అందరి ప్రేమాభిమానాలతో నేను బాగున్నా.  త్వరలో రెట్టింపు ఉత్సాహంతో మీ ముందుకు వస్తా’’ అని నవ్య వీడియోలో  పేర్కొన్నారు. ఆమెతో పాటు సీరియల్‌ షూటింగ్‌లో పాల్గొన్న వారిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. 


Updated Date - 2020-07-03T05:08:00+05:30 IST