ఆకట్టుకుంటున్న `టక్ జగదీష్` ఫస్ట్ లుక్!

ABN , First Publish Date - 2020-12-25T16:29:34+05:30 IST

`నిన్ను కోరి`, `మజిలీ` వంటి సున్నితమైన ప్రేమకథలు తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణతో కలిసి నేచురల్ స్టార్

ఆకట్టుకుంటున్న `టక్ జగదీష్` ఫస్ట్ లుక్!

`నిన్ను కోరి`, `మజిలీ` వంటి సున్నితమైన ప్రేమకథలు తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణతో కలిసి నేచురల్ స్టార్ నాని చేస్తున్న చిత్రం `టక్ జగదీష్`. క్రిస్మస్ సందర్భంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. వడ్డించిన విస్తరి ముందు టక్ వేసుకుని కూర్చొని వెనుక నుంచి కత్తి తీస్తున్న నాని ఫొటోను ఫస్ట్‌లుక్‌గా విడుదల చేశారు. 


నాని పాత్రపై సస్పెన్స్‌ను పెంచే విధంగా ఫస్ట్ లుక్ ఉంది. అలాగే ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయబోతున్నట్టు పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్  హీరోయిన్లుగా నటించారు. జగపతి బాబు కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించాడు. సన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కింది. 

Updated Date - 2020-12-25T16:29:34+05:30 IST