తగు జాగ్రత్తలతో 'టక్‌జగదీష్‌'

ABN , First Publish Date - 2020-10-23T19:30:33+05:30 IST

నేచురల్‌స్టార్‌ నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'టక్‌జగదీష్‌'. షైన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

తగు జాగ్రత్తలతో 'టక్‌జగదీష్‌'

నేచురల్‌స్టార్‌ నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'టక్‌జగదీష్‌'. షైన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోవిడ్‌ ప్రభావంతో ఆగిన ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెలలోనే ప్రారంభించారు. అయితే యూనిట్‌లో ఒకరికి కరోనా సోకడంతో మళ్లీ మేకర్స్‌ షూటింగ్‌ను ఆపారు. కాస్త గ్యాప్‌ తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్లీ యూనిట్‌ చిత్రీకరణను ప్రారంభించింది. అయితే ఈసారి మరిన్ని జాగ్రత్తలు వహిస్తున్నట్లు దర్శకుడు శివ నిర్వాణ తెలిపాడు. సెట్స్‌లో శానిటైజ్‌ చేస్తున్న వీడియో పోస్ట్‌ చేశాడు డైరెక్టర్‌. రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 'నిన్నుకోరి' తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో రానున్న చిత్రమిది. నాని వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి తదుపరి సినిమా శ్యామ్‌ సింగరాయ్‌ షూటింగ్‌లో పాల్గొనాలని అనుకుంటున్నాడట. 
Updated Date - 2020-10-23T19:30:33+05:30 IST

Read more