సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

త్రివిక్రమ్‌ వదిలిన ‘నల్లమల’ మోషన్‌ పోస్టర్‌

ABN, First Publish Date - 2021-01-01T00:39:56+05:30

'నల్లమల'.. ఈ మధ్య కాలంలో బాగా వినిపించిన పేరు. ఇప్పుడిదే టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రవిచరణ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'నల్లమల'.. ఈ మధ్య కాలంలో బాగా వినిపించిన పేరు. ఇప్పుడిదే టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రవిచరణ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను సంచలన దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. కథే ప్రధాన బలంగా వస్తోన్న ఈ చిత్రంలో అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, ఛలాకీ చంటి, ముక్కు అవినాశ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక మోషన్‌ పోస్టర్‌ విడుదల అనంతరం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ''చాలా మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తోంది. ఇటువంటి కథలు తెరకెక్కించాలంటే ఘట్స్‌ కావాలి. దర్శకుడు రవిచరణ్‌ సమర్థవంతంగా ఈ చిత్రాన్ని రూపొందించి ఉంటాడని భావిస్తున్నాను. మోషన్‌ పోస్టర్‌ చాలా బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుతూ.. యూనిట్‌కు నా అభినందనలు తెలియజేస్తున్నాను..'' అని తెలిపారు.


''సేవ్ నల్లమల అనే నినాదంతో ఎంతోమంది అభ్యుదయ వాదులు, అటవీ సంరక్షకులు ఎన్నో పోరాటాలు, నిరసనలు చేస్తున్నారు. అసలు నల్లమలకు ఏమైంది? ఆ అడవిని ధ్వంసం చేయాలని చూస్తున్నది ఎవరు?.. వంటి విషయాలను చర్చిస్తూ.. అలాంటి అంశాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన ఓ గొప్ప వీరుని కథే 'నల్లమల'. ఈ నేపథ్యంలో రకరకాల పాయింట్స్ చుట్టూ ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఆ అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాలను ఆవిష్కరిస్తూ సాగే కథ ఇది. ఇలాంటి చీకటి ఒప్పందాలకు వ్యతిరేకంగా తన భవిష్యత్ తరాల కోసం పోరాటం సాగించిన ఒక వీరుడు ఎదుర్కొన్న సమస్యలు, వాటిని అతనెలా పరిష్కరించాడు.. వంటి విషయాలతో పూర్తిగా వాస్తవ సంఘటనల నేపథ్యంలో సాగే సినిమా ఇది. వాస్తవ సంఘటనలే అయినా లవ్, ఎమోషన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌కు కూడా జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం..'' అని తెలిపారు దర్శకుడు రవిచరణ్‌. ఈ మోషన్‌ పోస్టర్‌ విడుదల కార్యక్రమంలో చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన అమిత్‌ తివారీ కూడా పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-01T00:39:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!