సోష‌ల్ మీడియాకు దూరంగా త్రిష‌

ABN , First Publish Date - 2020-06-15T20:00:27+05:30 IST

తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా త‌నకంటూ గుర్తింపు సంపాదించుకున్న హీరో్యిన్స్‌లో త్రిష ఒక‌రు.

సోష‌ల్ మీడియాకు దూరంగా త్రిష‌

తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా త‌నకంటూ గుర్తింపు సంపాదించుకున్న హీరో్యిన్స్‌లో త్రిష ఒక‌రు. మూడు ప‌దుల వ‌య‌సు దాటినా చెక్కు చెద‌ద‌ర‌ని గ్లామ‌ర్‌తో హీరోయిన్‌గా బిజీగానే ఉన్నారు త్రిష‌. సినిమాల‌తో పాటు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ చెన్నై సొగ‌స‌రి ... సోష‌ల్ మీడియా నుండి కాస్త బ్రేక్ తీసుకోవాల‌నుకున్నారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ‘‘ప్ర‌స్తుతానికి నా చుట్టుప‌క్క‌ల ఏం జ‌రుగుతుందో నాకు తెలియాల‌ని అనుకోవ‌డం లేదు. మన మ‌న‌సుకు ఇది డిజిట‌ల్ చికిత్స‌లాంటిది. లవ్ యు గ‌య్స్‌.. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ క‌లుద్దాం’’ అని తెలిపారు త్రిష‌. Updated Date - 2020-06-15T20:00:27+05:30 IST